ట్రిపుల్ ఆర్ కోసం ఆ తమిళ నటుడు.. బాహుబలి మీటర్ లోనే ఆర్.ఆర్.ఆర్..!

-

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గానే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన రాజమౌళి తన తర్వాత సినిమా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశాడు అదే ట్రిపుల్ ఆర్. రాజమౌళి ఆ టైటిల్ ఎనౌన్స్ చేసిన నాటి నుండి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమాలో రాం చరణ్, రామారావు అదేనండి మన ఎన్.టి.ఆర్ కలిసి నటిస్తున్నారని తెలిసి మరింత క్రేజ్ వచ్చింది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు రాజమౌళి బాహుబలి ఫార్ములానే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ట్రిపుల్ ఆర్ కోసం ఓ తమిళ నటుడిని ఓకే చేశాడట. కోలీవుడ్ లో డైరక్టర్ గా మంచి సినిమాలు తీసిన సముద్రఖని నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు.

ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ బాబాయ్ రోల్ లో సముద్రఖని కనిపిస్తారని అంటున్నారు. ఈ మూవీలో ఎన్.టి.ఆర్ ముస్లీం వ్యక్తిగా కనిపిస్తాడట. చరణ్ ఎలాగు పోలీస్ అన్న టాక్ వినిపిస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ పై రాజమౌళి అంచనాలు భారీగా పెంచాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version