బిగ్‌బాస్‌2 : ఈ వారం ఎలిమినేషన్ కూడా లీక్..?

-

రోజురోజుకీ రసవత్తరంగా మారుతోన్న బిగ్‌బాస్ ఇల్లు ఈరోజు మరో షాక్ ఇవ్వబోతున్నదా..? ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ముందుగానే ఆన్‌లైన్లో లీకవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, లీకుల బెడద మాత్రం తప్పడంలేదు.

తాజా లీకుల ప్రకారం, ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో కూడా తెలిసిపోయింది.

ప్రస్తుతం, లిస్ట్‌లో ఉన్నది మాత్రం ఈ ఆరుగురే. తనీష్, దీప్తి, గీతామాధురి, గణేశ్, బాబుగోగినేని, శ్యామల. ఇందులోంచి ఒకరు ఈరోజు ఇంటిబయటికి వెళ్లాల్సివుంటుంది. నిజానికి ఈ ఆరుగురే షోకు సూపర్‌స్టార్లు. ఒక గణేశ్‌ను మినహాయిస్తే, మిగిలిన ఐదుగురు బాగా ఫ్యాన్‌ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.

ఈవారం ఎలిమినేట్ కాబోతున్నది.. మరెవరో కాదు.. సంచలనాలకు కేంద్రబిందువు, ఇంటాబయట కూడా చాలామంది అసంతృప్తికి, ఆగ్రహానికి గురవుతున్నవాడు.. బాబు గోగినేని.

బాబు గోగినేని మామూలుగానే చాలా అగ్రెసివ్. జన విజ్ఙానవేదిక ద్వారానే చాలామంది శత్రువులను సంపాదించుకున్న ఈయన, బిగ్‌బాస్ ఇంట్లో మరింత అప్రదిష్ట మూటగట్టుకున్నాడు. విపరీతమైన సెల్ఫ్ ఈగో ఉన్న బాబు, తను చాలా తెలివిగలవాన్నని, తనకు చాలా విషయాలు తెలుసునన్న ఫీలింగ్‌తో ఉంటాడని తెలిసినవాళ్ల అభిప్రాయం. షో చూస్తున్నవాళ్లు, చేస్తున్నవాళ్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అన్నట్టు ప్రయోక్త నానితో సహా.  ఎన్నోసార్లు ఇంటిసభ్యులతోనూ, కొన్నిసార్లు నానితోనూ వాగ్వాదానికి దిగాడు. ఇవన్నీకూడా నాచురల్‌గానే నెగటివ్‌గా గుర్తింపబడతాయి. తననుతాను అంతర్జాతీయ సెలిబ్రిటీగా చెప్పుకున్నాడు కూడా.  బహుశా ఇదే కారణంతో ఇవాళ గోగినేని గారు ఇంట్లోంచి గెంటేయబడుతున్నారు కాబోలు. అన్నట్లు… బాబు గారికోసం కొన్ని పోలీస్ కేసులు కూడా ఎదురుచూస్తున్నట్టున్నాయి బయట..

Read more RELATED
Recommended to you

Exit mobile version