ఆస్ట్రేలియాలో అత్యున్నత అవార్డ్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్

-

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఎన్నో కామెడీ సినిమాతో అలరించాడు. ప్రస్తుతం స్టార్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ ఎలిజిబుల్ గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇంతకుముందే కెరియర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఈమధ్యనే నూజెర్సీ యూనియ్వర్సీలో లైఫ్ టైం అచీవ్ మెంట్ అందుకున్న రాజేంద్ర ప్రసాద్ లేటెస్ట్ గా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపునుండి కూడా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నాడు.

ఆస్ట్రేలియా కలచరక్ డిపార్ట్మెంట్ కు సంబందించిన ఏడుగురు ఎంపిల సమక్షంలో రాజేంద్ర ప్రసాద్ ఈ అవార్డ్ అందుకునారు. ఇప్పటికి చేసే పాత్రలు వేరైనా రాజేంద్ర ప్రసాద్ నటన ఆకట్టుకుంటుంది. సీనియర్ హీరోలైన జగపతి బాబు వరుసగా విలన్ అవకాశాలను అందుకుంటుంటే.. రాజేంద్ర ప్రసాద్ కూడా వరుసగా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఫాంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news