కొన్ని బంధాలు భూమి నుంచి.. మరి కొన్ని రక్తం నుంచి.. సల్మాన్ భాయ్ ‘భరత్’ టీజర్

-

సల్లూ భాయ్ నటిస్తున్న తాజా చిత్రం భరత్. సౌత్ కొరియా సినిమా ఓడ్ టు మై ఫాదర్ అనే సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. సల్మాన్ తో పాటు కత్రినా కైఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్, ఆసిఫ్ షేక్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1940లో దేశంలోని పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. సల్మాన్, జాఫర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదివరకు టైగర్ జిందా హై, సుల్తాన్ లాంటి సినిమాలు వీళ్ల కాంబినేషన్‌లోనే వచ్చాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను ఇవాళ భారత స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో టీజర్‌ను రిలీజ్ చేశాడు. కొన్ని సంబంధాలు భూమితో ఉంటాయి.. మరి కొన్ని రక్తంతో ఉంటాయి.. కాని నాకు ఈ రెండూ ఉన్నాయి.. అంటూ సల్మాన్ బాయ్ డైలాగ్ చెబుతుండగా బ్యాక్ గ్రౌండ్‌లో ఇండియా మ్యాప్‌ను చూపిస్తారు టీజర్ లో.

Read more RELATED
Recommended to you

Latest news