థమ్స్ యాడ్ కోసం మహేష్ ఎంత కష్టపడ్డాడో చూస్తే షాక్ అవుతారు..!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటాడో వాణిజ్య ప్రకటనలకు కొంత టైం కేటాయిస్తాడు. యాడ్స్ లో బాలీవుడ్ హీరోలతో పోటీ పడే ఒకే ఒక్క సౌత్ హీరో మహేష్ అని చెప్పొచ్చు. సినిమాలతోనే కాదు యాడ్స్ తో కూడా మహేష్ అభిమానులను అలరిస్తుంటాడు. మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసే వాటిలో థమ్స్ అప్ కూడా ఒకటి.

సాఫ్ట్ డ్రింక్స్ లో రారాజు అయిన థమ్స్ అప్ కోసం మహేష్ కొన్నాళ్లుగా బ్రాండింగ్ చేస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ హీరోలు సల్మాన్, రన్వీర్ లతో పాటుగా మహేష్ థమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వస్తున్నాడు. లేటెస్ట్ గా థమ్స్ కోసం ఓ స్పెషల్ యాడ్ షూట్ చేశారు. యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ యాడ్ మహేష్ రిలీజ్ చేశాడు. సాఫ్ట్ డ్రింక్ యాడే అయినా మహేష్ స్టంట్స్ మాత్రం అదిరిపోయాయి.

తను చేసిన ఇన్ని యాడ్స్ లో ఇంత యాక్షన్ ప్యాక్డ్ యాడ్ ఏది లేదని ఏకంగా మహేష్ బాబు తన ట్విట్టర్ లో ఈ యాడ్ పోస్ట్ చేస్తూ కామెంట్ పెట్టారు. మరి ఈ యాడ్ ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..

Read more RELATED
Recommended to you

Latest news