ఒకే ఒక్కడు సీక్వల్.. హీరో ఇళయదళపతి

-

తమిళ క్రేజీ డైరక్టర్ శంకర్ ప్రస్తుతం రోబో సీవల్ గా వస్తున్న 2.ఓ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. జెంటిల్ మన్ నుండి రాబోతున్న 2.ఓ వరకు తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తున్న శంకర్ 2.ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చారు. కమల్ హాసన్ తో ఆల్రెడీ ఇండియన్-2 మొదలుపెట్టిన శంకర్ ఆ సినిమా రెగ్యులర్ షూట్ ను త్వరలో మొదలుపెట్టనున్నారట.

అంతేకాదు ఇండియన్-2 సినిమా తర్వాత తన మరో సినిమా సీక్వల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శంకర్ డైరక్షన్ లో అర్జున్ హీరోగా వచ్చిన మదల్వన్ తెలుగులో ఒకే ఒక్కడుగా వచ్చి తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వల్ ను ప్లాన్ చేస్తున్నట్టు చెపాడు శంకర్. అయితే ఆ సీక్వల్ లో మాత్రం విజయ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయట.

కోలీవుడ్ లో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ రజిని తర్వాత అంత క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ తో ఒకే ఒక్కడు సీక్వల్ అంటే ఇక ఆ సీక్వల్ కు తిరుగే ఉండదు. మరి శంకర్ ఈ సినిమా ఎప్పుడు చేస్తాడు అన్నది మాత్రం చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news