సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ మెగాస్టార్ ట్వీట్..!

-

సినీ కార్మికులు దాదాపు 18 రోజుల నుంచి సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు తాజాగా సమ్మెకు శుభం కార్డు పడింది. వేతనాలతో పాటు ఇతర అంశాలపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య రాజీ కుదరడంతో శుక్రవారం నుంచి షూటింగ్స్ మళ్లీ ప్రారంభం కానున్నాయి. కార్మిక సంఘాలు 30 శాతం వేతనాల పెంపు కోరుతూ 18 రోజులుగా సమ్మె చేపట్టారు. కొద్ది రోజుల సమస్య కొలిక్కి రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి చొరువతో కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, FDC చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలోో కార్మిక సంఘాలు, నిర్మాతలు చలనచిత్ర వాణిజ్య మండలికి మధ్య సుదీర్ఘంగా చర్చలు ఫలించాయి.

Chiru

ఈ నేపథ్యంలోనే సినీ కార్మికులు సమ్మెను విరమింపజేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ” తెలుగు చిత్రసీమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ ను దేశానికే కాదు.. ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్ గా మార్చాలన్న ఆయన ఆలోచనలు అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి” అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. 

Read more RELATED
Recommended to you

Latest news