సైరా విల‌న్ అత‌నే

-

దేశభక్తి సినిమాలు అందరికీ కనెక్ట్ అవుతాయి. స్వాతంత్ర సంగ్రామం గురించి చక్కగా చూపిస్తే హిట్ అవుతుందని అనేక సినిమాలు నిరూపించాయి. అలంటి దేశభక్తి సినిమా సైరా నరసింహా రెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైరాగా నటిస్తున్నారు.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని 22 ఎకరాల్లో వేసిన సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఇందులో భోజ్ పురి స్టార్ నటుడు రవి కిషన్ కూడ నటిస్తున్నట్లు సమాచారం.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమాతో తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తొలిసినిమాతోనే ఆకట్టుకున్నారు. సుప్రీమ్ సినిమాలో నవ్వులు పూయించారు. లై, ఎమ్యెల్యే సినిమాల్లో తనదైన శైలిలో మెప్పించారు. తాజాగా చిరుతో తలపడుతున్నారు. రవి కిషన్, చిరంజీవి మధ్య భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్ సినిమాలో హైలెట్ కానుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా గురించి రవి కిషన్ మాట్లాడుతూ “సినిమాలో నా పాత్ర కీలకం. చిరంజీవిగారికి, నాకు భారీ ఫైట్ సీన్స్ ఉంటాయి. సురేందర్ రెడ్డి తనకు గాడ్ ఫాథర్ లాంటి వారు. ఆయన వలనే తెలుగు సినిమాల్లోకి ప్రవేశించాను” అని అన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version