‘గాండీవధారి అర్జున’ ఎందుకు చూడాలో ..10 కారణాలు చెప్పిన మూవీ టీమ్

-

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్.. ప్లాఫ్​లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఈ మెగా హీరోగా ప్రధాన పాత్రలో నటించిన.. ప్రవీణ్‌ సత్తారు రూపొందించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఇందులో వరుణ్‌కు జోడిగా సాక్షి వైద్య నటించింది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో చిత్రబృందం ప్రచార జోరు పెంచింది. ఈ సినిమాని ఎందుకు చూడాలో చెబుతూ యూనిట్‌ అంతా కలిసి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇంతకీ గాండీవధారి అర్జున సినిమా చూడటానికి ఆ మూవీ టీమ్ చెప్పిన పది కారణాలేంటో మీరూ చూసేయండి మరి.

యాక్షన్‌, స్టోరీ, లవ్‌, ఛేజింగ్స్‌, క్యారెక్టర్స్‌, ఇంటర్నేషనల్‌ లోకేషన్స్‌, ఫైట్స్‌, గన్స్‌, ఎమోషన్స్‌, ఘర్షణలు.. ‘గాండీవధారి అర్జున’లో ఈ పది అంశాలు అందరినీ ఆకట్టుకుంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈ వీడియోలో వరుణ్‌, సాక్షివైద్య, ప్రవీణ్‌ సత్తారు ఒక్కొక్కరు ఒక్కో అంశం గురించి చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news