కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమాల రికార్డులు ఎలా ఉన్నా సాంగ్స్ రికార్డ్స్ మాత్రం అదరగొడతాయి. అప్పట్లో త్రీ సినిమాలో వై దిస్ కొలవెరి డీ సాంగ్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ధనుష్ పాడటం అది కాస్త వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ధనుష్ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ అంత క్రేజ్ సంపాదించుకుంది.
ధనుష్ నటించిన మారి-2 సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. సినిమాలో కన్నా ఈ సాంగ్ యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ సాంగ్ అఫిషియల్ గా రిలీజ్ చేసిన రెండు వారాల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. కచ్చితంగా యూట్యూబ్ చరిత్రలో ఇదో సెన్సేషన్ అని చెప్పొచ్చు. ధనుష్ సరసన సాయి పల్లవి నటించిన ఈ సినిమాలో ఆమె నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ అవడానికి సాయి పల్లవి డ్యాన్స్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. వాట్సాప్ స్టేటస్ లో కూడా రౌడీ బేబీ సాంగ్ హల్ చల్ చేస్తుంది.
అంతకుముందు దాకా సాయి పల్లవి ఫిదా వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే సాంగ్ రికార్డ్ ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సైతం అతి తక్కువ టైంలో బ్రేక్ చేసింది రౌడీ బేబీ. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రౌడీ బేబీ సాంగ్ మారి 2కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.