రూ.543 కోట్ల బడ్జెట్‌తో 2.0..!

-

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖ స్టార్స్ నటించిన 2.0 చిత్రం ఈ ఏడాదిలో విడుదల కానున్న విషయం విదితమే. గతేడాదే ఈ చిత్రం విడుదల కావల్సి ఉన్నప్పటికీ పలు సాంకేతిక కారణాల వల్ల 2.0 విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సంవత్సరమే, అది కూడా అతి త్వరలోనే 2.0 చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

రజనీకాంత్ నటించిన రోబోకు సీక్వెల్‌గా 2.0 చిత్రాన్ని తెరకెక్కించిన విషయం విదితమే. కాగా 2.0 సినిమాలో క్రౌ మ్యాన్‌కు, రోబోకు మధ్య పోరు ఉంటుందని సినిమా పోస్టర్లను బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో విషయాన్ని నటుడు అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా వెల్లడించారు. అదేమిటంటే…

2.0 చిత్రాన్ని రూ.543 కోట్లతో తెరకెక్కించినట్లు అక్షయ్ వెల్లడించారు. ఇంత భారీ బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ సినిమా దేశంలోని మొదటిదని అక్షయ్ తెలిపారు. కాగా వినాయక చవితి సందర్భంగా 2.0 టీజర్‌ను విడుదల చేయనున్నారు. అయితే 2.0 సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాఫిక్స్ ఉంటాయట. చూసే ప్రేక్షకుడిని ఈ గ్రాఫిక్స్ విస్మయానికి గురి చేస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి 2.0 విడుదల ఎప్పుడు అవుతుందో, ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో వేచి చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news