2.ఓ తెలుగులో టాపు లేపుతుంది..!

-

శంకర్, రజిని కాంబినేషన్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా నవంబర్ 29న రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా 2.ఓ దాదాపు 10 వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. తమిళంలో 750 థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా తెలుగు రెండు రాష్ట్రాల్లో 1200 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందట. ఇక కర్ణాటక, కేరళలో కూడా 500, 600 స్క్రీన్స్ లో 2.ఓ రిలీజ్ కానుంది.

ఇక బిజినెస్ లో కూడా రజిని సత్తా చాటేలా జరుగుతుండటం విశేషం. ఆంధ్రాలో 35 కోట్లు, సీడెడ్ లో 14 కోట్లు, నైజాం ఏరియా 23 కోట్ల దాకా 2.ఓ పలికిందట. మొత్తం కలిపి తెలుగు రాష్ట్రాల్లోనే 70 కోట్ల పైగా బిజినెస్ జరిగింది. సినిమా ట్రైలర్ అంచనాలు డబుల్ చేయగా రజినితో పాటుగా క్రోమాన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ కూడా అదరగొడతాడని తెలుస్తుంది.

ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన 2.ఓకు ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ సంఖ్యలో రిలీజ్ అవుతున్న 2.ఓ మొదటి రోజే సంచలనాలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. బాహుబలి రికార్డులను బీట్ చేసేలా వస్తున్న 2.ఓ ఆ ఫీట్ సాదిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news