200 కోట్ల బడ్జెట్ తో హిరణ్యకశిప

-

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన గుణశేఖర్ ప్రస్తుతం రానాతో హిరణ్యకశిప సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. బాహుబలి భళ్లాలదేవాగా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రానా ఈసారి సోలోగా హిరణ్యకశిపతో సత్తా చాటాలని చూస్తున్నాడు. పౌరాణిక చిత్రాలకి ఆదరణ ఎక్కువే ఉంటుంది. చాలా కాలం తర్వాత ఈ జానర్ లో హిరణ్యకశిప సినిమా వస్తుంది.

సురేష్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లు కేటాయించారట. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటున్న సురేష్ బాబు ఈ భారీ ప్రాజెక్ట్ తో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని తెలుస్తుంది. సినిమాలో కూడా బాహుబలి, 2.ఓ స్థాయిలో వై.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

ఇక అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేయడమే తరువాయని అంటున్నారు. రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే అవడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version