11 వీడియోలు 3 కోట్లు.. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గురించి వర్మ వెరైటీ ట్వీట్..!

-

వర్మ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ప్రమోషన్స్ బీభత్సంగా చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ జీవితంలో జరిగిన వాస్తవాలను తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమాకు సంబందించి ప్రతి సందర్భాన్ని ప్రమోషన్స్ కు వాడుకుంటున్నాడు రాం గోపాల్ వర్మ. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎనౌన్స్ చేసిన నాటి నుండి టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా సినిమా నుండి వచ్చిన ప్రతి వీడియోకి ఆడియెన్స్ నుండి స్పందన అదిరిపోయింది.

దాని గురించి వర్మ వెరైటీ ట్వీట్ చేశాడు ఆర్జివి చాలెంజ్ వీడియో నుండి బ్యాక్ స్టాబ్ వరకు మొత్తం లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కు సంబందించి 11 వీడియోలు పెట్టారు వాటికి గాను మొత్తంగా 3 కోట్ల వ్యూస్ వచ్చాయట. మార్చి 22న లక్ష్మీస్ ఎన్.టి.అర్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేయగా ఆ సినిమాను అడ్డుకునేందుకు టిడిపి శాయశక్తులా కృషి చేస్తుంది. ఎవరేం చేసినా సినిమా మాత్రం రిలీజ్ చేసి తీరుతా అంటున్నాడు వర్మ. మొత్తానికి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ వీడియోలను 3 కోట్ల మంది చూశారంటే ఎన్.టి.ఆర్ అసలు కథను అంతమంది చూడాలనుకుంటున్నట్టే కదా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version