ఆ రీమేక్ కథ మార్చేస్తున్నారట..!

-

లాస్ట్ ఇయర్ కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీగా పాపులారిటీ తెచ్చుకున్న సినిమా 96. ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. చిన్న బడ్జెట్ తో రిలీజైన 96 సినిమా కోలీవుడ్ లో రికార్డ్ కలక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమా రిలీజ్ ముందే సినిమా చూసిన దిల్ రాజు రీమేక్ రైట్స్ కొనేశాడు.

అక్కడ హిట్ అవడంతో అదే సినిమాను తెలుగు రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలుగు రీమేక్ లో శర్వానంద్, సమంతలు నటిస్తున్నారని తెలుస్తుంది. మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమార్ 96 తెలుగు వర్షన్ డైరెక్ట్ చేస్తారట. అయితే 96 సినిమాలో హీరో, హీరోయిన్ 96 బ్యాచ్ మెట్స్ గా కనిపిస్తారు. అయితే తెలుగులో అది కాస్త 2009 బ్యాచ్ గా మారుస్తున్నారట. అంతేకాదు కొన్ని సీన్స్ కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మారుస్తున్నారట. 96 తమిళ వర్షన్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది చూశారు. మరి ఈ చేంజెస్ సినిమా ఫలితం మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news