అర్జున్ రెడ్డి పిల్లకి అక్కడ ఛాన్స్

-

ఒక సినిమా తమ ఫేట్ మార్చేస్తుందని అంటే అది ఎలా ఉంటుందో కొందరికి అర్ధం కాదు కాని ఆ అనుభవం పొందిన వారు మాత్రం సర్ ప్రైజ్ ఫీల్ అవుతుంటారు. రెండేళ్ల క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా అలాంటి అద్భుతాన్నే చేసింది. అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా విజయ్ ను స్టార్ హీరోగా మార్చగా అందులో హీరోయిన్ గా నటించిన సాలిని పాండేని బిజీ హీరోయిన్ అయ్యేలా చేసింది.

అయితే ఆ సినిమా సక్సెస్ తర్వాత షాలిని పాండే కథల విషయంలో కాస్త కన్ ఫ్యూజ్ అయ్యింది. అందుకే పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. మహానటి, ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాల్లో తనదైన ముద్ర వేసింది షాలిని. ఇదిలాఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రాం హీరోగా వస్తున్న 118 సినిమాలో నటిస్తున్న షాలినికి బాలీవుడ్ నుండి క్రేజీ ఛాన్స్ వచ్చింది.

హింది నటుడు పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా చేస్తున్న బాంఫాడ్ సినిమాలో షాలిని పాండే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. అనురాగ్ కశ్యప్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. మరి అనురాగ్ సినిమాలకు బాలీవుడ్ లో ఓ బ్రాండ్ ఉంది. అలా చూస్తే షాలిని పాండే కి బాలీవుడ్ లో కూడా అదరగొట్టే ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. మరి ఈ అవకాశాన్ని షాలిని ఎలా వాడుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news