ఇంద్ర భవనానికి ఏమాత్రం తీసిపోని బుట్ట బొమ్మ ఇల్లు.. అదుర్సేహే..!

-

బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే కాదు అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీని తప్పించుకుంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయిన పూజా హెగ్డే ఒక ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే మరొక ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ.. మరింత బిజీగా మారిపోయింది.ఇటీవల ఈమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఇందులో ఒక సినిమా కూడా విజయం సాధించకపోవడం గమనార్హం. కానీ ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది.

ఇక ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలుస్తున్న నేపథ్యంలో ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ డబ్బు వెనకేసుకొనే ప్రయత్నం చేస్తోంది బుట్ట బొమ్మ. ఇదిలా ఉండగా తాజాగా పూజ హెగ్డే ఇంటికి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ గా మారుతోంది. ఈమె ఇంటిని చూస్తే ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ వీడియోలో పూజా హెగ్డే తన ఇంటిని అభిమానులకు పరిచయం చేసింది. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో అలంకరించిన తన కలల సౌధాన్ని వివరిస్తూ ఒక వీడియోలో వివరించింది ఈ ముద్దుగుమ్మ. అత్యంత ఖరీదైన ఇంటి నిర్మాణాన్ని ఒక రీల్ వీడియోతో ఫాన్స్ కి వివరిస్తూ ఆమె తన ఇంటిని పరిచయం చేయడం చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఇస్ సిరీస్ వీడియోలలో భాగంగా ఇలా తన ఇంటిని ట్రైలర్ రూపంలో చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ వీడియోలో పూజ తన ఇంటి డిజైన్ వివరిస్తూ.. “నా తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నారు. మా నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి పని ఒత్తిడి ఎప్పుడు తీసుకోలేదు. ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాతో ఆటలు ఆడేవారు. దీనికి ప్రధాన కారణం మా ఇంటి వాతావరణమే “అంటూ చెప్పుకొచ్చింది. ఈమె ఇల్లు చూస్తే నిజంగా ఇంద్ర భవనాన్ని తలపిస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news