పెళ్లి చేసుకోబోతున్న వార్తలపై స్పందించిన తమన్నా

-

రెండు రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి.

దీనితో అందరూ ఆ వార్తలు నిజమేనని భావించారు. అయితే, మిల్కీ బ్యూటీ తమన్నా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్వరలోనే ఏడడుగులు వేయబోతుదంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించింది. ‘నా భర్తను పరిచయం చేస్తున్న’ అంటూ తాను ఇటీవల నటించిన ఎఫ్ 3 సినిమాలోని పాత్రకు సంబంధించిన క్లిప్పింగ్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కాగా, ఆ సినిమాలో తమన్నా మేల్ గెటప్ వేసుకుంది. ‘మ్యారేజ్ రూమర్స్’ అని హ్యష్ ట్యాగ్ జత చేసింది. ఇక తమన్నా క్లారిటీ ఇవ్వడంతో… మీడియా సంస్థలన్నీ గప్ చుప్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news