అబ్బబ్బబ్బ .. ఏం పెంచార్రా బాబు …ఇలా పెంచితే ఫ్యాన్స్ కి బావుంటుంది కాని మేకర్స్ కే దెబ్బైపోతుంది ..!

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే పూజా హెగ్డే అని అందరూ అంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డెబ్యూ సినిమా ముకుంద, అలాగే అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగులో బాగా పాపులర్ అయింది. అంతేకాదు ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా, ప్రస్తుతం మిగతా హీరోయిన్స్ కంటే రేస్ లో ముందు ఉంది. అందుకే ఇప్పుడు పూజా హెగ్డే కాల్షీట్స్ కోసం స్టార్ హీరోలు కూడా క్రేజీగా ఉన్నారు.

 

దాంతో టాలీవుడ్ లో పూజా హెగ్డే డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బక్కపలచని బ్యూటికి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట మేకర్స్. ఈ రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో ఇప్పటివరకు అందుకున్న హీరోయిన్ ఎవరూ లేకపోవడం ఆసక్తికరమైన విషయం. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాలు గనక హిట్ అయితే పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ లో చర్చ మొదలైంది.

ఇక టాలీవుడ్ లో పూజా హెగ్డే మాదిరిగానే బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే కియారా అద్వానినే అంటున్నారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో పరిచయమైన బ్లాక్ బస్టర్ ని అందుకుంది. కాని తర్వాత వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ అయినా తనకు మాత్రం మంచి రెమ్యూనరేషన్ ముట్టజెప్పారు. ప్రస్తుతం ‘గిల్టీ’తో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఒక ఊపు ఊపుతున్న కియారా తెలుగులో ఒక స్టార్ హీరోతో నటిస్తున్నారని సమాచారం.

ఈ సినిమాకు కియారా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని సమాచారం. అందుకు కారణం బాలీవుడ్ లో వరుసగా కియారా కి బ్లాక్ బస్టర్ దక్కడం తో పాటు అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు కమిటయి క్షణం తీరిక లేకుండా ఉంది. అక్కడ లక్కీ హీరోయిన్ గా పాపులర్ అయిన కియారాకి ఇప్పుడు టాలీవుడ్ లో కూడా భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారట.