MAA Elections 2021 : ప్యానెల్ ప్రకటించిన ప్రకాశ్ రాజ్

-

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల హడావుడి కూడా ఆరంభం అయింది. రెండేళ్ళకోసారి జరిగే మా ఎన్నికలు ఈ సారి కూడా రసవత్తర పోరుకు తెరతీయబోతున్నాయి. అయితే.. ఈసారి మా అధ్యక్ష ప‌ద‌వికి విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్.. యువ‌హీరో మంచు విష్ణు.. సీనియ‌ర్ న‌టీమ‌ణి జీవిత రాజ‌శేఖ‌ర్ పోటీబ‌రిలో నిల‌వ‌గా.. ఇప్పుడు నాలుగో పోటీదారుగా సీనియ‌ర్ స‌హాయ న‌టి హేమ పేరు ఖ‌రారైంది.

అయితే ఈ నేపథ్యంలో  సిని’మా’ బిడ్డ‌లం, మ‌న‌కోసం మ‌నం.. ‘మా’ కోసం మ‌నం అంటూ స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. “త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం.” అంటూ పేర్కొన్నారు ప్రకాష్ రాజ్.

ప్ర‌కాష్‌రాజ్ గారి ప్యానెల్
సిని ‘మా’ బిడ్డ‌లు

1. ప్ర‌కాష్‌రాజ్‌
2. జ‌య‌సుధ‌
3. శ్రీకాంత్‌
4. బెన‌ర్జీ
5. సాయికుమార్‌
6. తనీష్‌
7. ప్ర‌గ‌తి
8. అన‌సూయ‌
9. స‌న
10. అనిత చౌద‌రి
11. సుధ‌
12. అజ‌య్‌
13. నాగినీడు
14. బ్ర‌హ్మాజీ
15. ర‌విప్ర‌కాష్‌
16. స‌మీర్‌
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్‌
20. శివారెడ్డి
21. భూపాల్‌
22. టార్జ‌ాన్‌
23. సురేష్ కొండేటి
24. ఖ‌య్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవింద‌రావు
27. శ్రీధ‌ర్‌రావు

 

Read more RELATED
Recommended to you

Latest news