ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు (71) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గచ్చిబౌలి AIG హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సినీ నటుడు శరత్‌బాబు. ఆయన సెప్సిస్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరత్ బాబుకు డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు. ఇంకా వెంటిలేటర్ పైనే శరత్ బాబుకి ట్రీట్మెంట్ కొనసాగుతుంది.
ట్రీట్మెంట్ కోసం మొదట చెన్నై నుంచి బెంగళూరుకి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.. మెరుగైన వైద్యం కోసం ఈ నెల 20న బెంగుళూరు నుంచి హైదరాబాద్ AIGకి తీసుకువచ్చారు. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కి గురికావడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యలు. బయటకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచాలని ఆసుపత్రి వర్గాలను కోరిన శరత్ బాబు కుటుంబ సభ్యులు కోరినట్లుగా తెలుస్తోంది. శరత్ బాబు ఆరోగ్యం పై సాయంత్రం ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.