పెళ్లికి రెడీ అవుతున్న మ‌రో హీరో

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల ట్రెండ్ న‌డుస్తోంది. గ‌తంలో పెళ్లంటే అప్ప‌డే నాకు పెళ్లేంటి? అంటూ మీడియాపై కారాలు మిరియాలు నూరిన స్టార్స్ అంతా క్యూ క‌ట్టి మ‌రీ ప్ర‌స్తుతం పెళ్లికి రెడీ అయిపోతూ వ‌రుస షాకులిస్తున్నారు. దిల్ రాజు రెండ‌వ పెళ్లి నుంచి టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హంగామా మొద‌లైంది. ఆ త‌రువాత నిఖిల్‌, నితిన్‌, రానా వ‌రుస‌గా న‌చ్చిన‌, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకున్నారు.

త్వ‌ర‌లో మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక కూడా వివాహం చేసుకోబోతోంది. తాజాగా ఈ జాబితాలో ల‌వ‌ర్‌బాయ్ త‌రుణ్ చేర‌బోతున్నాడు. ఇటీవ‌ల టాలీవుడ్ లో డ్ర‌గ్స్  క‌ల‌క‌లం సంద‌ర్భంగా వార్త‌ల్లో నిలిచిన త‌రుణ్ తాజాగా పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం త‌నకు కాబోయే శ్రీ‌మ‌తి కుటుంబ స‌భ్యుల‌తో మాటా మంతీ జ‌రుపుతున్నార‌ట‌.

త‌రుణ్ సినిమాలు మానేసి రెండేళ్ల‌వుతోంది. `ఇది నా ల‌వ్ స్టోరీ`తో మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో పబ్బులతో పాటు బిజినెస్ చూసుకుంటున్న త‌రుణ్ త్వ‌ర‌లోనే పెళ్లికి సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.