ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఎన్నో రోజులుగా ఎదురుచూసిన వాళ్ళకి కావాల్సినంత వినోదం అందించడానికి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం అయ్యింది. మొదటి మ్యాచులో ముంబై ఇండియన్ పై చెన్నై సూపర్ కింగ్స్ పై చేయి సాధించింది. అంబటి రాయుడు సూపర్ ఫామ్ లో ఉండగా, చెన్నై విజయ తీరాలని అందుకుంది. ఐతే కరోనా వల్ల ఐపీఎల్ సీజన్ దుబాయ్ లో జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం లేదు. సో.. ప్రతీ ఒక్కరూ టీవీల్లో వీక్షించాల్సిందే. ఐతే టీవీల్లో మ్యాచులు చూస్తున్నాం బానే ఉంది గానీ, ఖాళీగా ఉన్న స్టేడియాన్ని చూస్తుంటే వింతగా అనిపిస్తుంది. స్టేడియ ఖాళీగా ఉందని తెలిసిన తర్వాత కూడా టీవీల్లో మ్యాచ్ చూసే వారికోసం అరుపులు, గోలలు యాడ్ చేస్తున్నారు. మైదానం ఖాళీగా ఉన్నా అరుపులు రావడం విచిత్రంగా ఉంది.
టీవీల్లో సీరియల్స్ వస్తున్నప్పుడు అది జోక్ అవునో కాదో మనకు తెలియని టైమ్ లో బ్యాగ్రౌండ్ లో నవ్వుల చప్పుడు వినిపించినట్టు, ఫోర్ కొట్టగానే గోలలు, ఔట్ అవ్వగానే ఈలలు వినిపిస్తున్నాయి. క్రికెట్ మ్యాచుని కూడా సినిమా చూస్తున్నట్టుగా, సీరియల్ చూస్తున్నట్టుగా చేయడం కొంత విచిత్రంగా ఉంది. ఐతే ఇలా చూడడం మొదటిసారి కాబట్టి ఇలా జరుగుతుందని, రెండు మూడు మ్యాచులు పోతే అదే అలవాటు అవుతుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్ వైరల్ అవుతున్నాయి.