విశాల్.. అనీషా ఎంగేజ్మెంట్ పూర్తి..!

తమిళ హీరో విశాల్ తెలుగు అమ్మాయి అనీషా రెడ్డిల పెళ్లి మ్యాటర్ తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు తమ అంగీకారం తెలిపారు. హైదరాబాద్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురైన అనీషా రెడ్డి విశాల్ తో పెళ్లికి సిద్ధమైంది. ఈరోజు ఘనంగా వారి నిశ్చితార్ధం జరిగింది. హైదరాబాద్ లోని హోటల్ గ్రాండ్ లో విశాల్, అనీషాల నిశ్చితార్ధం గ్రాండ్ గా జరిగింది.

కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు.. సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. రీసెంట్ గా హైదరాబాద్ లోనే కోలీవుడ్ హీరో ఆర్య, సయేషా సైగల్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు విశాల్, అనీషాల జంట ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే జరగడం విశేషం. ప్రస్తుతం విశాల్ కోలీవుడ్ లో మంచి ఫాం లో ఉన్నాడు. ఎన్.టి.ఆర్ టెంపర్ రీమేక్ గా అయోగ్య సినిమా చేస్తున్నాడు విశాల్. ఏప్రిల్ 19న ఆ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.