ఎద్దును గోమాతగా మార్చిన టీడీపీ..!

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 25 రోజుల సమయమే ఉండటం.. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలతో ఏపీలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. 

అధికార పార్టీ టీడీపీకి మాత్రం గత కొన్ని రోజుల నుంచి భలే షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ నుంచి చాలా మంది ముఖ్యనేతలు వైఎస్సాఆర్సీపీలో చేరారు. మరికొంతమంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనేపథ్యంలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో.. ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. దానిలో భాగంగానే టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటనలను విడుదల చేసింది. అవి ఇప్పుడు ప్రతి టీవీ చానెల్‌లో దర్శనమిస్తున్నాయి. ఏపీని చంద్రబాబే అభివృద్ధి చేశారని.. ఆయన వల్లనే ఏపీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్న కాన్సెప్ట్‌తో చాలా యాడ్స్‌ను రూపొందించిది టీడీపీ.

అయితే.. ఓ యాడ్‌లో ఎద్దును గోమాతగా చూపించిన తీరును బీజేపీ తప్పుపట్టింది. సీఎం చంద్రబాబు వల్ల తాను గోమాతను కొనుక్కున్నట్లు ఓ మహిళ చెబుతున్నట్టుగా ఆ యాడ్ ఉంటుంది. ఆ యాడ్‌లో మహిళ చూపించిన గోమాత.. ఆవు కాదు. అది ఎద్దు. దాన్ని బీజేపీ నాయకులు తమ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసి టీడీపీతో ఓ ఆట ఆడుకుంటున్నారు. టీడీపీకి అబద్ధాలు ఆడటం కూడా రాదు అన్నట్టుగా బీజేపీ.. టీడీపీపై విరుచుకుపడుతోంది.