వైఎస్ వివేకానంద రెడ్డి మరణంపై సంచలన నిజాలు బయట పెట్టిన వివేకా మనవడు వైఎస్ అవినాష్‌రెడ్డి

నాకు ఫోన్ రావడంతో నిన్న 6:15 నిమిషాలకు నేను వివేకా గారి ఇంటికి వెళ్ళాను, బెడ్ పక్కన రక్తం చూసి స్ట్రోక్ తో బ్లడ్ వామిటింగ్ అయి బాత్రూం కి వెళ్లి పడిపోయి ఉంటారు అనుకున్నాం.

అక్కడ ఆయన రక్తపు మడుగులో ఉన్న బాడీ ని చూసి షాక్ అయ్యాం, బాడి వెళ్లికల పడుకుని ఉండటంతో గాయాలు కనిపించలేదు, మేమె బాడీ ని బెడ్ రూమ్ లోకి తీసుకు వచ్చి చూస్తే ఒంటి నిండా కత్తి పోట్లు ఉన్నాయి అప్పుడే ఇది హత్య అని నిర్ధారించుకున్నాము.

అప్పటికే వేల సంఖ్యలో అభిమానులు రావడంతో గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదు అని తలకు డ్రెస్సింగ్ చేసి, రక్తంతో తడిచిన నైట్ డ్రెస్ మీద దుప్పటి కప్పుకుని హాస్పిటల్ కి వెళ్ళడానికి బయటకు తీసుకొచ్చాము.

అలా కాకుండా ఇది హత్య అని అప్పుడే మేము చెప్తూ రక్తంతో ముద్దయిన బాడీ ని బయటకు తీసుకొచ్చి ఉంటే అభిమానులు ఆగ్రహావేశాలకు ఏమి జరుగుతుందో అని భయపడ్డాం: వైఎస్ అవినాష్‌రెడ్డి (వివేకా గారి మనవడు).