ఇన్నాళ్ళకి తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన అనుష్క ..!

-

అనుష్క శెట్టి తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చి 15 ఏళ్ళు అయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సెలబ్రేషన్స్ ని సినీ ప్రముఖుల సమక్షంలో అనుష్క నటిస్తున్న తాజా చిత్ర బృదం ఘనంగా నిర్వహించారు. రాజమౌళి, రాఘవేంద్ర రావు, పూరి జగన్నాధ్ లాంటి ప్రముఖులందరు అనుష్క గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. తన లాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఇంకొకరు లేరని తెలిపారు. అంతేకాదు అనుష్క అంటే అమ్మ అన్న వాళ్ళు ఉన్నారు.

 

ఇక సూపర్ సినిమాతో టాలీవుడ్ లో కి దూసుకొచ్చిన స్వీటి అనుష్క ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానన్ని సంపాదించుకుంది. అరుంధతి లాంటి సినిమాలో నటించిన ఘనత అనుష్క కే దక్కడం కూడా ఒక గొప్ప విషయం. లేడీ ఓరియొటెడ్ సినిమా అంటే ఠక్కున అనుష్క నే మేకర్స్ కి గుర్తొచ్చేంత పాపులారిటిని సంపాదించుకుంది. ఇంత స్టార్ డం ని సంపాదించుకున్న అనుష్క తాజాగా మీటూ’, ‘కాస్టింగ్ కౌచ్’ ల గురించి స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనుష్క శెట్టి ‘కాస్టింగ్ కౌచ్’ తన అభిప్రాయాలను తెలియజేసారు.

‘మీటూ’ మరియు ‘కాస్టింగ్ కౌచ్’లు అనేవి ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు .. ప్రతీ రంగంలోనూ ఉన్నాయి. జాబ్ కోసం బయటి వస్తున్న ఆడవాళ్ళకి వేధింపులు తప్పడం లేదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మన టాలీవుడ్ లో నావరకైతే ఈ సమస్య ఎప్పుడు ఎదురుకాలేదని తెలిపింది. నేను ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా నిజాయతీగా మాట్లాడతాను. మహిళలు ఏ రంగంలోనైనా సక్సస్ అవాలంటే రెండు పద్దతులున్నాయని వాటిలో మంచి పద్దతినే నేను ఎంచుకున్నానని వెల్లడించింది. ఇక అనుష్క ప్రస్తుతం మాధవన్ తో కలిసి నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news