తొలి తెలంగాణా వ్యక్తికి కరోనా పాజిటివ్..!

-

తెలంగాణాలో తొలి వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. దీనితో తెలంగాణాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 21 కి చేరింది. ఇప్పటి వరకు తెలంగాణాలో నమోదు అయిన కేసులు అన్నీ కూడా విదేశీయులకు మాత్రమే నమోదు అయ్యాయి. లేదా విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ సోకింది.

ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎక్కడా ఇబ్బంది లేకుండా తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన కెసిఆర్… తెలంగాణలో అన్ని పబ్లిక్ సర్వీసులను రేపు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసర సర్వీసుల మాత్రమే ఉంటాయని, ఆర్టీసి బస్ లను హైదరాబాద్ మెట్రో ని కూడా మూసి వేస్తున్నామని ప్రకటించారు.

ఇక ఇతర రాష్ట్ర సరిహద్దులను కూడా తెలంగాణా ప్రభుత్వం మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణా నుంచి మహారాష్ట్రకు కరోనా వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉందని ఆ సరిహద్దులను కూడా మూసి వేస్తున్నామని ప్రకటించారు. కేవలం ఆస్పత్రులు, పాలు, అత్యవసర సరుకులు మాత్రమే అందుబాటులో ఉంటాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news