మళయాళ స్టార్ హీరో దిలీప్ కు కేరళ హైకోర్ట్ లో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2017లో మళయాళ సినీ నటిపై లైంగికదాడి కేసులో దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు హీరోయిన్ ను కారులో కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేశారు. దిలీప్ సూచనల మేరే సదరు సినీ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అదే సమయంలో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దర్యాప్తు అధికారులను బెదిరించిన కేసులో కూడా దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేరళ హైకోర్ట్ సూచనల మేరకు కేరళ క్రైంబ్రాంచ్ పోలీసులు దిలీప్ ను ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఈ నివేదికను కేరళ హైకోర్ట్కు నివేదించారు. అయితే తాజాగా ఈరోజు ఆయనకు కేరళ హైకోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల సదరు హీరోయిన్ తనపై జరిగిన దాడికి సంబంధించిన కేసులో నిందితులకు త్వరగా శిక్షపడేలా చేయాలని కేరళ సీఎం పినరయి విజయన్ ని కోరింది. దీంతో మళ్లీ ఈ కేసు చర్చనీయాంశం అయింది. సదరు నటిపై జరిగిన లైంగిక దాడి అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.