కేసీఆర్ ప్లాన్ కమ్యూనిస్టులకు తెలిసిందా?

-

ఈ మధ్య కేసీఆర్ రాజకీయంగా ఎలాంటి ప్లాన్ చేసిన..ఆ ప్లాన్ ప్రత్యర్ధులకు అర్ధమైపోతుంది…ఆయన ప్లాన్స్ అనుకున్న విధంగా సక్సెస్ కావడం లేదు. గతంలో అంటే కేసీఆర్ వ్యూహాలు ప్రత్యర్ధులకు పెద్దగా అర్ధమయ్యేవి కాదు..అర్ధమయ్యే లోపే కేసీఆర్ తన పనులని చక్కదిద్దుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్తితి అలా లేదు..కేసీఆర్ వ్యూహాలు ప్రత్యర్ధులకు అర్ధమైపోతున్నాయి.

ఇటీవల కేసీఆర్….దేశ రాజకీయాలని తనవైపుకు తిప్పుకునేలా చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే..మళ్ళీ థర్డ్ ఫ్రంట్ అంటూ…దేశంలో పలు పార్టీలని ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఏ పార్టీ కూడా కేసీఆర్‌కు సహకరించే పరిస్తితి కనిపించలేదు. పైగా ఇటీవల రాజ్యాంగం మార్చాలని కామెంట్ చేసి హైలైట్ అయ్యారు…ఆ కామెంట్ ద్వారా దేశ రాజకీయాల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవ్వాలని చూశారు..కానీ అది కూడా రివర్స్ అయింది.

ఇలా కేసీఆర్ ప్లాన్స్ ఎక్కడకక్కడ బెడిసికొడుతున్నాయి.  ఈ క్రమంలోనే కమ్యూనిస్టులని దగ్గర చేసుకోవాలన్న కేసీఆర్ ప్లాన్ కూడా రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ మధ్య కేసీఆర్, కమ్యూనిస్ట్ నేతలని ప్రగతి భవన్‌కు ఆహ్వానించి వారితో చర్చలు చేసిన విషయం తెలిసిందే. అసలు పెద్దగా కమ్యూనిస్టులతో మాట్లాడని కేసీఆర్..సడన్‌గా వారిపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు చేశారు…అలాగే వారిని పిలిపించి థర్డ్ ఫ్రంట్‌పై చర్చలు చేశారు. పైగా తమ అనుకూల మీడియాలో కేసీఆర్‌తో కమ్యూనిస్టులు కలుస్తున్నారని ప్రచారం చేయించారు. అయితే వెంటనే కేసీఆర్ ప్లాన్ అర్ధం చేసుకున్న కమ్యూనిస్టులు..టీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తి లేదని, తాము కాంగ్రెస్‌తోనే ముందుకెళ్తామని చెప్పారు.

అయితే తాజాగా సి‌పి‌ఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సైతం…కేసీఆర్ నమ్మదగిన వ్యక్తి కాదు అని కామెంట్ చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఓట్లను విభజించే ఎత్తుగడతో ఉన్నారని, అందుకే ఎన్‌డీఏకు అనుకూలంగా ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినీ కేసీఆర్‌ కలవడం లేదని, ప్రధాని మోదీని వ్యతిరేకించినట్లే ఉండాలని, అదే సమయంలో మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కూడా ఉండాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు చెప్పారు. అంటే కేసీఆర్…పరోక్షంగా బీజేపీకి సాయం చేస్తున్నారని కమ్యూనిస్టులకు అర్ధమైంది. మొత్తానికి కేసీఆర్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ అయ్యేలా లేవు.

Read more RELATED
Recommended to you

Latest news