కోటి రూపాయలు పారితోషకం తీసుకున్న తొలి తెలుగు హీరోయిన్‌, ఇంట్లోంచి పారిపోయి పెళ్లిచేసుకుందట

-

ఇప్పుడు హీరో హీరోయిన్లు కోటి రూపాయలకు పైగా రెమ్యునిరేషన్‌ తీసుకుంటున్నారు. కానీ పది గ్రాముల బంగారం 90 రూపాయలు ఉన్న టైమ్‌లో ఆ హీరోయిన్‌ 25000 పారితోషికం తీసుకుంది. ఇండియాలోనే కోటీ రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి నటిగా ఆమె రికార్డులు సృష్టించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్‌ అనుకుంటున్నారా..? అలనాటి నటి భానుమతి. భానుమతి గురించి కొన్ని ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్స్‌ మీకోసం.

Bhanumati

సెప్టెంబరు 7, 1925న జన్మించిన భానుమతి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, సంగీత స్వరకర్తగా తనదైన శైలిలో మెప్పించారు. అంతే కాదు, ఆమె భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ప్రజలు ఆమెను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. నివేదికల ప్రకారం, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయలు ఉన్నప్పుడు, భానుమతికి ఒక్కో చిత్రానికి 25000 రూపాయలు చెల్లించే వారట. భానుమతి తన 60 ఏళ్ల కెరీర్‌లో 97 తమిళ, తెలుగు హిందీ చిత్రాలలో నటించారు. భానుమతి తెలుగు సినిమా తొలి మహిళా దర్శకురాలు కూడా. 1953లో విడుదలైన చండీరాణి సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా అదే తనకు మొదటి సినిమా. భానుమతికి 2001లో భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి పద్మభూషణ్ అవార్డు లభించింది.

పుట్టింది ఆంధ్రాలోనే..

భానుమతి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో జన్మించారు. తల్లిదండ్రులకు భానుమతి మూడవ సంతానం. భానుమతి తల్లితండ్రులు సంగీతంలో ప్రావీణ్యం కలవారు కాబట్టి చిన్నతనంలోనే ఆమెకు సంగీతం నేర్పించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బానుమతి చిన్నప్పటి నుంచి తన తండ్రి స్టేజ్‌పై చేసే ప్రదర్శనను చూసేది. 1939లో భానుమతికి తన మొదటి సినిమా ‘వర విక్రయం’లో ఆఫర్ వచ్చినప్పుడు ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలేనట..

‘వర విక్రయం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో భానుమతి కాళింది అనే 13 ఏళ్ల అమ్మాయిగా నటించింది, ఆమె పెద్ద వ్యక్తిని బలవంతంగా వివాహం చేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. దీని తర్వాత భానుమతి మాలతీ మాధవం, ధర్మ పట్టి మరియు భక్తిమాలలలో కనిపించింది, అయితే ఆమెకు కృష్ణ ప్రేమ్ సినిమాతో బాగా గుర్తింపు వచ్చింది.

1951లో భానుమతి సూపర్‌హిట్ చిత్రం మల్లేశ్వరి విడుదలైన తర్వాత ఆమె కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంది. ఈ సినిమాలో ఎన్టీ రామారావుతో కలిసి పనిచేశారు. ఈ చిత్రం దక్షిణాది సినిమాలోనే ఆల్-టైమ్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. హిందీ చిత్రాలలో దిలీప్ కుమార్‌తో కలిసి నటించింది. 1962లో భానుమతి నటించిన తమిళ చిత్రం అన్నే విడుదలైంది. ఈ చిత్రానికి ఆమె జాతీయ అవార్డును గెలుచుకుంది. అంతేకాకుండా, 1964లో అంతస్థులు, 1966లో పల్నాటి యుద్ధంతో జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.

ఇంట్లోంచి పారిపోయి పెళ్లిచేసుకుంది

1943లో కృష్ణ ప్రేమ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రామకృష్ణారావును భానుమతి కలిశారు. అప్పుడే వారి మధ్య. ప్రేమ చిగురించింది. భానుమతి తండ్రి వీరి పెళ్లిని వ్యతిరేకించాడు. అందుకే రామకృష్ణరావును పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. 1943 ఆగస్టు 8న వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. పేరు భరణీ. కుమారుడి పేరుమీద భరణీ పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. భానుమతి నిజానికి వివాహం తర్వాత నటనకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది, కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లైన కొన్ని నెలలకే ఆమె మళ్లీ సినిమాల్లో నచింటింది. వివాహం తర్వాత కూడా అనేక సూపర్ హిట్ చిత్రాలను అందించింది. భానుమతి డిసెంబర్ 24, 2005న చెన్నైలో కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news