ఇన్​స్టాగ్రామ్​లో ప్రభాస్ అకౌంట్ మిస్సింగ్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఓవైపు ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ఫైర్‌’.. మరోవైపు ‘కల్కి 2898 ఏడీ.. ఇంకోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్.. మారుతితో ‘రాజా డీలక్స్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సలార్, కల్కి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్​గా ఉండడు. ఇక కొద్ది రోజుల క్రితమే సినిమా ప్రమోషన్ల కోసం.. ఫ్యాన్స్​తో టచ్​లో ఉండటానికి ఇన్​స్టాగ్రామ్​లో అడుగుపెట్టాడు. అయితే తాజాగా ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ కనిపించడం లేదు.

ఇన్‌స్టాలో ప్రభాస్‌ పేరును సెర్చ్‌ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’ అనే అలర్ట్ కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు ప్రభాస్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందా.. లేదా డి-యాక్టివేట్‌ చేశారా అని నెటిజన్లు అయోమయంలో ఉన్నారు. ఈ విషయం పట్ల ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జులై నెలలో ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా కూడా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే. ‘మనుషులు దురదృష్టవంతులు’ అంటూ ఆనాడు హ్యాకర్లు ఓ వీడియో షేర్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news