పింక్ శారీలో మాయ చేస్తున్న యాపిల్ బ్యూటీ హన్సిక

-

యాపిల్ బ్యూటీ హన్సిక వరుస అవకాశాలతో జోరు మీద ఉంది. ఓవైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది. ఇక తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. తాజాగా ఈ భామ పింక్ కలర్ శారీలో తన ఫొటోలు పోస్టు చేసింది. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోల్లో హన్సిక పింక్ కలర్ శారీ కట్టుకుని, చెవులకు పెద్ద జుంకాలు పెట్టుకుని కనిపించింది. కర్లీ హెయిర్ను లూస్గా వదిలేసుకుని మత్తెక్కించే చూపులతో పోజులిచ్చింది. ఓవైపు నడుం అందాలు చూపిస్తూ మరోవైపు కనిపించీ కనిపించని క్లీవేజ్ షోతో కుర్రకారుకు మతిపోగొట్టింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మా హన్సు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటూ కామెంట్లు పెడుతున్నారు. హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు.

ఇక హన్సిక సినిమాల సంగతికి వస్తే వరుస అవకాశాలతో ఈ భామ జోరుమీదుంది. గతేడాది హన్సిక మొత్తం నాలుగు సినిమాలతో సందడి చేసింది. నాలుగు చిత్రాలు నాలుగు జోనర్లకు సంబంధించినవి కావడం విశేషం. మై3, పార్ట్నర్, మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది కూడా గాంధారి, గార్డియన్, రౌడీ బేబీ చిత్రాలతో బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news