తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటీమణులు ఎంతోమంది ఉన్నప్పటికీ.. నటి మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె సీనియర్ నటుడు అయిన విజయ్ కుమార్ ను వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ముఖ్యంగా వనిత, ప్రీతి, శ్రీదేవి . ఇక ఇందులో వనిత, శ్రీదేవి ఇద్దరూ కూడా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. నటి మంజుల కూడా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను, సినీ ప్రముఖులను బాగా ఆకట్టుకుంది. అయితే మంజుల చనిపోయేటప్పుడు చాలా నరకాన్ని అనుభవించిందట. ఆమె గురించి విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు ఆగవు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంజుల కుమార్తే వనిత కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తుంది. నటి మంజుల ఇంట్లో కేవలం కాలు జారి కింద పడడంతో ఆమె మృతి చెందిందని ఇంటర్వ్యూ సందర్భంగా వనిత తెలిపింది. 2013వ సంవత్సరంలో మంజుల ఇంట్లో కింద పడడంతో నుదుట కాస్త వాపు ఏర్పడిందట.. అయితే దాని వల్ల ప్రమాదం ఏమీ జరగలేదని కాస్త జండూబామ్ రాసిందట. కానీ నటి మంజుల కు కడుపులో బలంగా దెబ్బ తగిలిందట. దీనివల్ల ఆమెకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యేది అని దాని ఫలితంగా రక్తం గడ్డ కట్టి కిడ్నీలపై అధిక ప్రభావం చూపిందని వనిత తెలియజేసింది.తన తల్లి కింద పడిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని ఒక హాస్పిటల్ లోకి వెళితే వైద్యులు పరీక్షించి అనంతరం.. కేవలం మీ అమ్మ మరో మూడు రోజులు బతుకుతుంది అంటూ షాకింగ్ విషయాన్ని తెలిపారట. డాక్టర్ చెప్పే మాటలు విని తన పరిస్థితిని వనిత తో తన తల్లి చెప్పిందట. ఇక దాంతో ఆమె ఆరోగ్యం ప్రతిరోజు క్షీణించిపోయింది అని తెలియజేసింది. ఈ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చాలా కంగారు పడేదాన్ని అని వనిత తెలిపింది.
ఇక రెండు రోజులపాటు హాస్పిటల్ లో ఉండడం వల్ల తన తండ్రి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమన్నారట. కానీ ఎవరిని చూసినా కూడా మంజుల.. వనిత , వనిత అని పిలవడంతో తన.. భర్త విజయ్.. వనిత కి ఫోన్ చేసి రమ్మని చెప్పగా.. ఆమె హాస్పిటల్ లోకి రాగానే తన తల్లిని చూడగానే ఆమె మరణించిందని తెలియజేసింది.