ఇక పై నో లిప్ లాక్స్.. నో కౌగిలింతలు.. నో బెడ్ రూమ్ సీన్స్…!

regina cassandra
regina cassandra

ఇక పై నో లిప్ లాక్స్.. నో రొమాంటిక్ సీన్స్.. అంటోంది టాలీవుడు ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా. కరోనా నేపద్యంలో షూటింగులు అన్నీ ఆగిపోయాయి. సినిమాలు లేవు సినిమా హాల్లు లేవు సినీ తారలు కూడా ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపద్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నటి రెజీనా కసాండ్రా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇకపై తాను నటించే సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ ఉండబోవని తెలిపింది. లిప్ లాక్ సన్నివేశాలు, కౌగిలింతలు, బెడ్ రూమ్ సీన్స్ లేకుంటేనే అంగీకరిస్తానని, అటువంటి సీన్స్ లో పాల్గొనాలంటే భయంగా ఉందని ఆమె చెప్పింది. ఈ భయం నాలోనే కాదు అందరూ యాక్టర్స్ లోనూ ఉందని ఆమె వెల్లడించింది.