కారోనా ను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన నాలుగో విడత లాక్‌డౌన్ గడువు జూన్ 30 తో ముగియనుంది. గత రాత్రి ఆన్ లాక్ 2.0 నిబంధనలు కూడా కేంద్రం విడుదల చేసింది. కాగా ఎన్ని లాక్ డౌన్ లు విధించినా కొన్ని ప్రాంతాల్లో కరోనా ను కట్టడి చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు… ఈ రాష్ట్రాల్లో కరోనా విజృంభణ చాలా ఎక్కువగా ఉంది. దీంతో తాజాగా నిన్న సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడగించింది జులై 31 వరకు పూర్తి లాక్ డౌన్ విధించింది. ఇక ఇదే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో కూడా జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా జూలై 31 వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినా మంధురై, గ్రేటర్ చెన్నై పోలీస్ లిమిట్స్‌లో మాత్రం జూలై 5 వరకు కంప్లీట్ లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపింది. గ్రేటర్ చెన్నై పరిధిలోని చెన్నై, కాంచిపురం, చెంగల్పట్టు, తిరువళ్లువార్ ఏరియాల్లో జూలై 5 వరకు కఠినంగా లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
తమిళనాడు లో మరోసారి లాక్ డౌన్..! కానీ ఈసారి కాస్త డిఫరెంట్ గా….
-