త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మరో బాలీవుడ్ బ్యూటీ

-

దిల్లీ డాల్, సొట్టబుగ్గల బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్లో ఝుమ్మంది నాదం సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసి ఆ తర్వాత మకాం బాలీవుడ్కు మార్చింది. ఇక అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. బీ టౌన్లో తాప్సీ రూటే సపరేటు. ఈ భామ వర్సటైల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం తాప్సీ సినిమాలే కాదు ఆమె మాటలు చేతలు కూడా ఇతర హీరోయిన్ల కంటే చాలా భిన్నం.

ఇక తన పర్సనల్ లైఫ్ను అంతగా ఎక్స్పోజ్ చేయని తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల చాలా మంది హీరోయిన్లు తమ బ్యాచిలర్ లైఫ్నకు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రకుల్ తన బాయ్ ఫ్రెండ్ జాకీని వివాహమాడింది. ఇక తాప్సీ కూడా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియస్ బోను సీక్రెట్గా వివాహమాడనుందట. గత పదేళ్ల నుంచి ఈ జంట రిలేషన్షిప్లో ఉంది. ఈ విషయాన్ని తాప్సీ అధికారికంగా ప్రకటించకపోయినా ఇది అందరికీ తెలిసిన రహస్యమే. ఉదయ్‌పూర్ వీళ్ల పెళ్లికి వేదిక కానుందని సమాచారం. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news