హిమాచల్ లో రాజకీయ సంక్షోభం.. కాంగ్రెస్ సర్కార్ను గద్దె దించేందుకు బీజేపీ యత్నం

-

పార్లమెంట్ ఎన్నికల ముందు పలు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం కలకలం రేపుతోంది. ఇటీవలే బిహార్లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హిమాచల్ ప్రదేశ్లోనూ సంక్షోభం నెలకొంది. ఈ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఇక్కడున్న ఏకైక రాజ్యసభ సీటును గెలుచుకున్న ఒకరోజు తర్వాత జైరాం ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ నేతలు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా గవర్నర్ను ఈరోజు ఉదయం కలవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉండే నైతిక హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు జైరాం ఠాకూర్ విమర్శించారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ ప్రవర్తన గురించి గవర్నర్కు చెప్పామని జైరాం ఠాకుర్ అన్నారు. అసెంబ్లీలో ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఓటింగ్ కోరినప్పుడు అనుమతించలేదని, సభ రెండుసార్లు వాయిదా పడిందని తెలిపినట్లు చెప్పారు. ఆ తర్వాత తమ ఎమ్మెల్యేలతో మార్షల్స్ ప్రవర్తించిన తీరు సరికాదన్న ఠాకుర్.. ఆ సమయంలో ఎమ్మెల్యేలు గాయపడ్డారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news