నేపాల్ లోని కాట్మండు మేయర్ కు ఆది పురుష్ చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పింది. ఈ మూవీలో సీత భారత్ లో పుట్టినట్టు చూపించగా… నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. అటు ఖాట్మండు మేయర్ సహా ఆ దేశ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డైలాగ్ తీసేసి క్షమాపణ చెప్పకుంటే భారత సినిమాలు తమ దేశంలో అనుమతించమని హెచ్చరించారు.
దీంతో మేయర్, సెన్సార్ బోర్డులకు టి సిరీస్, యువి క్రియేషన్స్ క్షమాపణ చెబుతూ లేఖ రాశాయి. కాగా, ఆదిపురుష్ సినిమా విడుదలై మూడ్రోజులుగా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా.. మూడు రోజుల్లో రూ.340 కోట్లు సాధించింది. రికార్డు ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన ‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ జర్నీ.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా.. వీకెండ్లో కలెక్షన్లను దుమ్ములేపుతున్నాయి.