గాలి జనార్దనరెడ్డి ఆస్తుల జప్తునకు సీబీఐ కోర్టు ఆదేశం

-

మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు, ఆయన భార్య అరుణ పేరుతో ఉన్న 124 ఆస్తుల్లో 100కు పైగా జప్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జనార్దన రెడ్డిపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ పూర్తయ్యే వరకూ ఆస్తులను జప్తులోనే ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆస్తుల జప్తునకు అనుమతులెందుకు ఇవ్వడం లేదని గత ప్రభుత్వాన్ని అప్పట్లో న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేయడంతో కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

సీబీఐ కోర్టు ఆస్తుల జప్తుపై ఆదేశాలు జారీ చేయడంపై గాలి జనార్దన రెడ్డి స్పందించారు. ‘ఆస్తులను జప్తు చేసినా భయపడను. కారాగారంలో ఉన్నప్పుడు రూ.1200 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. న్యాయ పోరాటం చేసి, జప్తును రద్దు చేయించుకున్నా’ అని గాలి జనార్దన రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news