నేడే ‘ఆదిపురుష్​’ ప్రీరిలీజ్​ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్​గా ప్రభాస్​ హోలోగ్రామ్

-

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ కథానాయకుడిగా బీ టౌన్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్‌ డ్రామా ఆదిపురుష్‌. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి తీర్చిదిద్దిన ఈ మూవీ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. భారీ హంగులతో ఈ వేడుక జరగనుంది. దీనికి సంబంధించి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.

ఈ ఈవెంట్​లో సినీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగుల ప్రభాస్‌ హాలోగ్రామ్‌ ప్రదర్శించనున్నారు. అయోధ్యను తలపించేలా తిరుపతిలో భారీ సెట్‌ వేశారు. శ్రీరాముడు, వేంకటేశ్వరస్వామి రెండూ శ్రీమహావిష్ణువు అవతారాలే. దాన్ని దృష్టిలో ఉంచుకునే అటు అయోధ్య, ఇటు తిరుపతిల మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని తలపించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దారు. 100 డ్యాన్సర్లు, 100మంది గాయనీ గాయకులు ఆదిపురుష్‌తో పాటు, రామాయణానికి సంబంధించిన గీతాలను ఆలపించనున్నారు. డైరెక్టర్​ ప్రశాంతవర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news