ఆ దర్శకుడికి హీరోయిన్ గా మారెందుకే నటినయ్యా.. అదితి రావ్ వైరల్ కామెంట్స్

-

టాలీవుడ్ హీరోయిన్ అందాల భామ అదితి రావ్ హైదరి తాజాగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తమిళ సినిమాలు, ప్రముఖ డైరెక్టర్ మణిరత్నంపై మాట్లాడుతూ తాను నటిగా ఎందుకు మారిందో చెప్పుకొచ్చింది.

అందాల భామ అదితి రావు హైదరి తాజాగా మాట్లాడుతూ భారతీయ సినిమాలో తను భాగమైనందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నానంటూ తెలిపారు. ఈ నేపథ్యంలో.. ”నేను మణిరత్నం కథానాయికను కావాలనుకున్నాను. అందుకే నటిగా మారాను ప్రయోగాలు చేయడంలో భాషతో సంబంధం లేదు” అంటూ తెలిపారు.

Aditi Rao Hydari Upcoming Movies 2020, 2021 & 2022 List With Release ...

అలాగే ”నేను ఎప్పుడూ సినిమాని హిందీ, తమిళం అని చూడలేదు. నా దృష్టిలో ఏదైనా అద్భుతమైన దర్శకుల కథనం మాత్రమే. ఎవరైనా నటీనటులు సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నట్లయితే అద్భుతమైన దర్శకుల దృష్టిలో భాగం అవుతారు. మణి సర్ తో నేను చేసిన సినిమా నా జీవితాన్ని అన్ని విధాలుగా మార్చేసింది.. ఆన్ స్క్రీన్ ఇమేజ్ కి దశలు ఉన్నాయని.. పనిని ఎంచుకునే విధానంలో ఒక ప్రక్రియ ఉంటుందని తెలిపింది. అలాగే ముందుగా దర్శకులను ఎంపిక చేసుకుంటాను. నాకు కథ చెప్పడానికి వచ్చే దర్శక నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకానికి చాలా మెచ్చుకుంటా.. స్క్రిప్ట్ ను నాకు ఆఫర్ చేసిన పాత్రను చూస్తాను. అన్నీ కుదిరితే ఆ పాత్రను ఎంపిక చేసుకుంటాను. నేను ఎంపికల విషయంలో జానర్ లేదా భాషని చూడను. ఎంచుకునే దర్శకుడు.. కథను అనుసరించి దశలవారీగా ముందుకు వెళతామని కొంతవరకూ టైప్ కాస్టింగ్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను. దర్శకులు తారల్ని ఒక నిర్దిష్ట మార్గంలో చూస్తారు. ఎక్కువ మంది అలా చూడాలనుకుంటున్నారు లేదా ఎక్కువ మంది దర్శకులు అలా ఉపయోగించుకోవచ్చని భావిస్తాను. ఇది అంత చెడ్డ విషయం అని నేను అనుకోను అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news