ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని IRCTC టూరిజం తీసుకు వస్తోంది. ఈ ప్యాకేజీ లతో ఎంచక్కా నచ్చిన ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. పైగా ఈ ప్యాకేజీలు సీజన్‌కు తగ్గట్టు ఉంటాయి. మరికొన్ని రోజుల్లో శ్రావణమాసం మొదలు అవ్వనుంది. ఈ మాసంలో భక్తులు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అందుకే ఆధ్యాత్మిక ప్రదేశాలను చూసి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఐఆర్‌సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సెవెన్ జ్యోతిర్లింగ యాత్ర ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఏడు జ్యోతిర్లింగ క్షేత్రాలను భక్తులు చూసి రావచ్చు. ఈ యాత్ర గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవ్వనుంది. భారత్ గౌరవ్ రైల్లో ప్రయాణం చేయాలి.
దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భేట్ ద్వారక, ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, భీమశంకర్ జ్యోతిర్లింగాలను చూడవచ్చు. ఈ యాత్ర 9 రాత్రులు, 10 పగళ్లు ఉంటుంది. జులై 27న ప్రారంభమై ఆగస్టు 5 వరకు ఉంటుంది. రిషికేశ్, హరిద్వార్, మొరాదాబాద్, బరేలీ, షాజహాన్‌పూర్, హర్దోయ్, లక్నో, కాన్పూర్, ఒరై వీరాంగన లక్ష్మీబాయి, లలిత్‌పూర్ దగ్గర ట్రైన్ ఎక్కవచ్చు.
యాత్రికులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి శాకాహార భోజనం ఇస్తారు. అలానే ఈ ప్యాకేజీ చార్జీలు మూడు కేటగిరీలు వారీగా ఉంటాయి. ఎకానమీ క్లాస్, స్టాండర్డ్ క్లాస్, కంఫర్ట్ క్లాస్‌లో ఉంటున్నాయి. స్లీపర్ క్లాస్ లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు బుకింగ్ చేస్తే ఒక్కొక్కరికి రూ.18,925 పే చెయ్యాలి. ఐదు నుంచి 11 ఏళ్ల పిల్లలకు అయితే రూ.15,893 పే చేయాలి. ఇలా క్లాసుని బట్టీ చార్జీలు మారుతాయి. ఈఎంఐ సౌకర్యం కూడా అందిస్తోంది. టూర్ టిక్కెట్ ఈఎంఐలో బుక్ చెయ్యచ్చు. ప్రయాణికులు నెలకు రూ.917 ఈఎంఐ పే చెయ్యాలి. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ని సంప్రదించండి.