ఓన్లీ సినిమా అంతకుమించి ఏది లేదు.. పెళ్లి మ్యాటర్ పై అడివి శేష్ క్లారిటీ..!

-

నిన్న సోషల్ మీడియాలో గూఢచారి హీరో అడివి శేష్, ఆ సినిమాలో నటించిన అక్కినేని వారమాయి సుప్రియ పెళ్లి అంటూ ఒకటే హడావిడి మొదలైంది. అందులో వాస్తవం ఎంత అన్నది తెలియకుండానే అడివి శేష్ తో సుప్రియ పెళ్లి అంటూ అందరు వార్తలు రాశారు. 40 ఏళ్ల వయసు కలిగిన సుప్రియ 33 ఏళ్లు ఉన్న అడివి శేష్ ను ఎలా పెళ్లాడుతుంది. అయితే ఎవరి ఇష్టాలు వారివి వారిద్దరికి నచ్చితే చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటూ వార్తలు రాసుకొచ్చారు.

అయితే ఈ వార్తలు అడివి శేష్ దాకా వెళ్లడంతో వీటికి వివరణ ఇచ్చాడు గూఢచారి హీరో. గాయ్స్ అండ్ గర్ల్స్.. నా జీవితంలో పెద్ద విషయం ఉంది అంటే అది కేవలం సినిమా మాత్రమే.. నటన, రైటింగ్ ఇలా నాకిష్టమైనవి చేస్తూ జీవితాన్ని సాకారం చేసుకుంటున్నా.. కష్టపడుతున్నా.. నన్ను నేను మెరుగుపరచుకుంటున్నా.. నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ మెసేజ్ పెట్టాడు. సో తన పెళ్లిపై వస్తున్న వార్తలన్ని రూమర్స్ మాత్రమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదు. కేవలం మీడియా సృష్టి మాత్రమే.. నన్ను వదిలేయండి నాకు సినిమానే అన్ని అంటూ అడివి శేష్ ఇచ్చిన ఇన్ స్టాగ్రాం మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

#Truth

A post shared by Sesh Adivi (@adivisesh) on

Read more RELATED
Recommended to you

Latest news