కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్.. అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ ప్రముఖులు..!

-

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీస్ కు మరింత పాపులారిటీ వచ్చింది. అయితే వారు చేసే పనుల మీద ఓ నిఘా ఉంటుందన్న విషయం మర్చిపోయారు. లేటెస్ట్ గా కోబ్రా పోస్ట్ ద్వారా వెళ్లడైన విషయాలను చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. సెలబ్రిటీస్ తము చేసే ట్వీట్స్ కు డబ్బు తీసుకుంటున్న వైనం కోబ్రా పోస్ట్ ద్వారా వెళ్లడైంది. ఒకరిద్దరు కాదు బాలీవుడ్ కు చెందిన మొత్తం 36 మంది సెలబ్రిటీస్ ఈ లిస్ట్ లో ఉన్నారు.

కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా సెలబ్రిటీస్ తమ మేనేజర్ల ద్వారా వారిని కలుసుకుని లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులకు సపోర్ట్ గా ట్వీట్ చేస్తే వారికి తగిన మొత్తం ఇస్తారని డీల్ కుదుర్చుకున్నారు. దీనికి 36 మంది సెలబ్రిటీస్ ఒప్పుకోవడం విశేషం. అంతేకాదు అత్యాచారం, ఏదైనా వివాదాస్పద విషయాల పట్ల కూడా వీరు ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచేందుకు అంగీకరించారు. అయితే ఈ ప్రచారం కప్పిపిచ్చేలా ఏదో ఒక డమీ ప్రాజెక్ట్ పై వారు చేస్తున్నట్టు కటింగ్ ఇస్తారట.

కోబ్రా పోస్ట్ సంపాదకుడు అనిరుద్ధ బహల్ ఆధారాలతో కూడిన వీడియోలను బయటపెట్టాడు. ఈ కాంట్రాక్ట్ కు ఒక్కొక్కరికి 2 లక్షల నుండి 50 లక్షల దాకా డబ్బు ముట్టిందట. కోబ్రా పోస్ట్ రిలీజ్ చేసిన లిస్ట్ లో జాకీ ష్రాఫ్, సోనూసూద్, వివేక్ ఒబెరాయ్, కైలాశ్ ఖేర్, అమీషా పటేల్‌, సన్నీ లియోన్‌, శ్రేయస్‌ తల్పడే, రాఖీ సావంత్‌, శక్తి కపూర్‌, పంకజ్‌ ధీర్‌, ఆయన కుమారుడు నికితిన్‌ ధీర్‌, కోయినా మిత్రా, పునీత్‌ ఇస్సార్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, మిన్నిసా లాంబ, టిస్కా చోప్రా, మహిమా చౌధురి, రాహుల్‌ భట్‌, రోహిత్‌ రాయ్‌, అమన్‌ వర్మ, గాయకులు దలేర్‌ మెహందీ, మికా, అభిజిత్‌ భట్టాచార్య, బాబా సెహ్‌గల్‌, నృత్య దర్శకుడు గణేశ్‌ ఆచార్య, హాస్య నటులు రాజ్‌పాల్‌ యాదవ్‌, రాజు శ్రీవాస్తవ, కృష్ణ అభిషేక్‌, విజయ్‌ ఈశ్వర్‌లాల్‌ పవార్‌ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news