అడివి శేష్‌.. మ‌రీ ఇంత ర‌హ‌స్యమా.. తెలియ‌కుండానే సినిమా తీసేశారు..!

-

గూఢ‌చారి త‌రువాత అంద‌రూ అడివి శేష్ చేస్తున్న ‘మేజ‌ర్’ సినిమా కోసం చూస్తున్నారు కానీ.. ఇంత‌లోనే అడివి శేష్.. ‘ఎవ‌రు’ అనే సినిమా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి అంద‌రికీ షాకిచ్చారు.

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం త‌మ‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ న‌టుల్లో అడివి శేష్ ముందు వ‌రుస‌లో ఉన్నాడు. అత‌ను న‌టించిన ‘గూఢ‌చారి’ సినిమా, అంత‌కు ముందు వ‌చ్చిన ‘క్ష‌ణం’ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ‘గూఢ‌చారి’ మూవీ త‌రువాత అడివి శేష్ ‘మేజ‌ర్’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి ప్ర‌ముఖ న‌టుడు మ‌హేష్ బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే ఈ సినిమాను లాంచ్ చేయ‌గా వ‌చ్చే ఏడాది దీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

అయితే ‘గూఢ‌చారి’ త‌రువాత అంద‌రూ అడివి శేష్ చేస్తున్న మేజ‌ర్ సినిమా కోసం చూస్తున్నారు కానీ.. ఇంత‌లోనే అడివి శేష్.. ‘ఎవ‌రు’ అనే సినిమా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి అంద‌రికీ షాకిచ్చారు. అస‌లు ఈ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మైందీ, ఎవ‌రు తీస్తున్న‌దీ, న‌టీన‌టులు, సాంకేతిక వ‌ర్గం ఎవ‌రు ? అన్న వివ‌రాలు ఏమీ ఎవరికీ తెలియ‌దు. అంతా ర‌హ‌స్యంగా కానిచ్చేశారు. ఈ క్ర‌మంలో ఇవాళే అడివి శేష్‌.. ‘ఎవ‌రు’ సినిమాకు చెందిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

కాగా అడివి శేష్‌కు చెందిన కొత్త సినిమా ‘ఎవ‌రు’ ఆగ‌స్టు 23న విడుద‌ల అవుతుంద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే సినిమాలో ఉన్న ట్విస్టులు ఎవ‌రికీ తెలియ‌కుండా ఉండేందుకు ఇలా ర‌హ‌స్యంగా చిత్రాన్ని షూట్ చేశామని అడివి శేష్ చెప్పుకొచ్చారు. కాగా ‘ఎవ‌రు’ మూవీని పీవీపీ సినిమా బ్యాన‌ర్‌పై పెర్ల్ వి.పొట్లూరి, ప‌వ‌ర్ వి.పొట్లూరి, కావిన్ అన్నెలు నిర్మిస్తుండ‌గా, ఈ చిత్రానికి వెంక‌ట్ రామ్‌జీ దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అలాగే అడివి శేష్ స‌ర‌స‌న రెజీనా హీరోయిన్‌గా న‌టిస్తోంది. న‌వీన్ చంద్ర‌, ముర‌ళీ శ‌ర్మ‌లు ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ‌రి ఈ సినిమా కూడా అడివి శేష్‌కు మంచి పేరు తెచ్చి పెడుతుందా, లేదా అన్న‌ది త్వ‌ర‌లో తేల‌నుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version