మాయాబజార్ తర్వాత రంగస్థలం.. అరుదైన రికార్డ్..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ బొమ్మ రంగస్థలం. 2018 సమ్మర్ లో వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నిటిని కొట్టేసింది. ఇక ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన రికార్డ్ సొంతం అవుతుంది. అదేంటి అంటే ఈ సినిమా కన్నడ భాషలో డబ్ చేయబడుతుండటమే. తెలుగు సినిమాలు కన్నడలో డబ్ అవడం చాలా అరుదు. ఎప్పుడో మాయాబజార్ సినిమా కన్నడలో డబ్ అయ్యింది.

ఆ తర్వాత రంగస్థలం సినిమానే ఆ రికార్డ్ సొంతం చేసుకుంది. రంగస్థలం కన్నడ వర్షన్ రంగస్థల అని రిలీజ్ చేస్తున్నారు. ఒక్క కన్నడ మాత్రమే కాదు తమిళ, మళయాళ భాషల్లో కూడా రంగస్థలం సినిమా డబ్ అవుతుంది. తెలుగులో సంచలనాలు సృష్టించిన రంగస్థలం తమిళ, కన్నడ భాషల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news