‘అర్జున్ సురవరం’ టీజర్.. మీ అందరికి టి.ఆర్.పి పిచ్చి పట్టింది..!

-

యువ హీరో నిఖిల్ డిఫరెంట్ సినిమాలను చేస్తూ కెరియర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. యువ హీరోల్లో రీమేక్ సినిమాలను చేస్తూ వస్తున్న నిఖిల్ వాటికి తగినట్టుగానే ఫలితాలను అందుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిఖిల్ ఆ సినిమా నిరాశపరచగా లేటెస్ట్ గా తమిళ సూపర్ హిట్ మూవీ కణితన్ రీమేక్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు టైటిల్ గా అర్జున్ సురవరం అని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. జర్నలిస్ట్ గా పనిచేసే హీరో సిస్టెంలో జరుగుతున్న ఓ పెద్ద స్కామ్ ను ఎలా బయటపెట్టాడు అన్నది సినిమా కథ. టీజర్ లో మీడియా వాళ్ల మీద సెటైర్ గా మీకు టి.ఆర్.పి పిచ్చి పట్టిందని డైలాగ్ బాగా తగులుతుంది.

ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా ఈజీ.. కాని ఒక నిజాన్ని నిజమని ప్రూవ్ చేయడం చాలా కష్టం. నా పేరు అర్జున్ లెనిన్ సురవరం.. అంటూ టీజర్ అదరగొట్టాడు నిఖిల్. మరి ఈ అర్జున్ సురవరం ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అన్నది చూడాలంటె మార్చి 29 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news