ఎన్టీఆర్ తర్వాత చరణ్ కూడా..!

-

అరవింద సమేత సినిమా కోసం ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుంది. ముఖ్యంగా సినిమాలో ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ లుక్ నందమూరి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ స్టార్ హీరోలంతా సిక్స్ ప్యాక్ మీద మోజు పడినట్టు ఉన్నారు.

ఎన్.టి.ఆర్ తర్వాత రాం చరణ్ ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడట. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అందులో చరణ్ సిక్స్ ప్యాక్ తో అంటే ఇక మాస్ ఆడియెన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. 2019 సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్స్ గా స్టేట్ రౌడీ, రౌడీ తమ్ముడు లాంటి ప్రచారంలో ఉన్నాయి.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను హీరోయిన్ కియరా అద్వాని ఫీమేల్ లీడ్ గా చేస్తుంది. తమన్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాతో రంగస్థలం హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు రాం చరణ్.

Read more RELATED
Recommended to you

Latest news