అరవింద సమేత సినిమా సూపర్ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉన్న త్రివిక్రం పై మరో కాపీ మరక పడ్డది. అజ్ఞాతవాసి సినిమానే లార్గో వించ్ సినిమా రీమేక్ అంటూ అపవాదాలు మూటకట్టుకున్న త్రివిక్రం అరవింద సమేత కథను చాలా జాగ్రత్తగా రాసుకున్నాడని అనుకున్నారు. సినిమా కచ్చితంగా త్రివిక్రం కలం నుండి వచ్చిన మాట నిజమే అయితే సినిమాలో వాడిన మొండికత్తిని వాడటం త్రివిక్రంను ఇరుకున పడేసింది.
రాయలసీమ యాసలో రచనలు చేసే వేంపల్లి గంగాధర్ కేంద్రీయ సాహిత్య అకాడెమీ యువ పురస్కారాన్ని ప్రణబ్ చేతుల మీదగా అందుకున్నారు. అయితే అతను చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గంగాధర్ పాపాఘ్ని కథల పేరుతో ఓ బుక్ రాశారు. అందులో మొండికత్తి అనే కథ కూడా ఉంది. అరవింద సమేత కోసం త్రివిక్రం గంగాధర్ తో చర్చలు జరిపి అతను రాసిన కథల గురించి డిస్కస్ చేసుకున్నారట. అయితే ఈ సినిమాలో మొండికత్తి ప్రస్థావన రాగానే తాను షాక్ అయ్యానని.. తనకు డబ్బులు ఇవ్వకున్నా కనీసం టైటిల్ కార్డ్ లో పేరు కూడా వేయలేదని. కనీసం ఇలా వాడుతున్నామని తనకు సమాచారం కూడా లేదని అన్నాడు గంగాధర్. మరి ఇతను కామెంట్స్ కు త్రివిక్రం ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.